కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్ ఆస్తుల కంటే ఎక్కువ. ఏడుకొండల స్వామికి బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో రూ.16 వేల కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు వెల్లడించింది.
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2019 జూన్ వరకు 10.20 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 5358.11 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2019 జూన్ వరకు 288.19 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికి 1694.25 కోట్ల రూపాయలు, బ్యాంక్ అఫ్ బరోడా 2019 జూన్ వరకు రూ.1956.53 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 1839.36 కోట్లు ఉన్నాయని ప్రకటించింది.
ఇక కెనరా బ్యాంక్ లో 2019 జూన్ వరకు 4913.73 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 1351.00 కోట్ల రూపాయలు, యాక్సిస్ బ్యాంక్ 2019 జూన్ వరకు 151.59 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 1006.20 కోట్ల రూపాయలు, హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ బ్యాంకులో 2019 జూన్ వరకు 1253.68 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 2122.85 కోట్ల రూపాయలు, సౌత్ ఇండియన్ బ్యాంకులో 2019 జూన్ వరకు 1229.29 కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నారు.
ఇండస్ ఇండ్ 2019 జూన్ వరకు 1218.99 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో 2022 సెప్టెంబర్ నాటికీ 779.17 కోట్లు గవర్నమెంట్ అఫ్ ఇండియా బాండ్స్ రూపంలో 2019 జూన్ వరకు 55.17 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 555.17 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2022 సెప్టెంబర్ నాటికీ 660.43 కోట్ల రూపాయలు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ లో 2019 జూన్ వరకు రూ.4.87 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 306.31 కోట్లు ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ 2022 సెప్టెంబర్ నాటికీ రూ. 101.43 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 2019 జూన్ వరకు రూ.34.46 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ రూ. 25.30 కోట్లు ఫెడరల్ బ్యాంక్ 2019 జూన్ వరకు రూ.80.04 కోట్లు ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ లో 2022 సెప్టెంబర్ నాటికీ 9.70 కోట్లు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో 2019 జూన్ వరకు 88.31 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 99.91 కోట్లు, బ్యాంకు అఫ్ ఇండియా 2019 జూన్ వరకు 5.53 కోట్లు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 2019 జూన్ వరకు రూ.3.74కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ రూ. 1839.36 కోట్లు ఉన్నయని శ్వేత పత్రంలో పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2022 సెప్టెంబర్ నాటికీ రూ. 1.28 కోట్లు, కరూర్ వైశ్య బ్యాంక్ లో 2022 సెప్టెంబర్ నాటికీ రూ. 4.37 కోట్లు,ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2019 జూన్ వరకు రూ. 10.00 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 4.0 కోట్లు ఏపీ స్టేట్ కో ఆప్షన్ బ్యాంక్ 2019 జూన్ వరకు 50.77 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 1.30 కోట్లు, 2019 జూన్ వరకు మొత్తం డిపాజిట్ అయినా నగదు 13025.09 కోట్లు 2022 వరకు మొత్తం డిపాజిట్ అయినా నగదు 15938.68 కోట్లు ఉన్నాయని శ్వేతపత్రం విడుదల చేశారు.స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2019 జూన్ మాసం వరకు శ్రీవారి బంగారు డిపాజిట్స్ 5387.56 కేజీలు కాగా...2022 సెప్టెంబర్ నాటికీ 9819.38 కేజీలు ఉన్నాయి అంటూ స్వేతపత్రంలో పేర్కొంది టీటీడీ.