Jayaho BC Mahasabha: డిసెంబర్ 7న జయహో బీసీ మహాసభ, రాష్ట్రవ్యాప్తంగా 84000 మంది కీలక బీసీ నాయకులకు ఆహ్వానం, ముఖ్య అతిధిగా సీఎం జగన్

గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్ ని (Jayaho BC Mahasabha Poster) బీసీ నాయకులు రిలీజ్ చేసారు.

Jayaho BC Mahasabha (Photo-AP CMO)

Vjy, Dec 1: డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్ ని (Jayaho BC Mahasabha Poster) బీసీ నాయకులు రిలీజ్ చేసారు. 7వ తేదీ ఉదయం 8 గంటలకు మొదళ్లయ్యే ఈ సమావేశం (Jayaho BC Mahasabha) సాయంత్రం వరుకు కొనసాగనుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జోనల్ వారీగా బీసీ మీటింగ్ లు పెట్టనున్నారని ప్రకటించారు.

గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..

డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలతో పాటు, చెప్పని కొత్త అంశాలను కూడా చేర్చి, సీఎం జగన్ అమలు చేస్తున్నారాని అన్నారు. ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు.. అందర్నీ ఈ సమ్మేళనానికి హాజరుఅవ్వుతారని తెలిపారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు, సమీర్‌ శర్మపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ కొట్టివేత

ఈ సమావేశంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మార్గాని భరత్ తదితరులు హాజరైయ్యారు.