AP Assembly Sessions 2022: హాట్ హాట్‌గా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

అమరావతి, సెప్టెంబర్ 15: ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్‌ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు.

2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్‌ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో పోలవరానికి వేల కోట్ల నష్టం, పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు, చంద్రబాబుపై మండిపడ్డ అంబటి రాంబాబు

టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారని సుధాకర్‌బాబు అన్నారు.టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రనని జోగి రమేష్‌ అన్నారు.దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదని జోగారావు అన్నారు.

నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్‌ అభివృద్ధి చేశారని మేరుగ నాగార్జున అన్నారు.సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన అని అంబటి రాంబాబు అన్నారు.

ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్‌, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు.



సంబంధిత వార్తలు

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్