Andhra Pradesh Lockdown 3.0: ఏపీలో మూడవ దశ లాక్‌డౌన్, గ్రీన్ జోన్లలో 25 శాతం పెంపుతో మద్యం అమ్మకాలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

మే 17 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ 3.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా మూడవ దశ లాక్‌డౌన్‌ను (Andhra Pradesh Lockdown 3.0) రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. కరోనా (Coronavirus) నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా నేటి నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

Andhra Pradesh Lockdown 3.0: Find Out What Activities Are Allowed In Your Zone till may 17 (Photo-getty)

Amaravati, May 4: దేశ వ్యాప్తంగా మూడవ దశ లాక్‌డౌన్ (Lockdown 3.0) నేటి నుంచి అమల్లోకి రానుంది. మే 17 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ 3.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీలో కూడా మూడవ దశ లాక్‌డౌన్‌ను (Andhra Pradesh Lockdown 3.0) రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. కరోనా (Coronavirus) నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా నేటి నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.  తెరుచుకోనున్న మద్యం షాపులు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు

కేంద్ర హోంశాఖ ఆదేశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 246 క్లస్టర్లను గుర్తించింది. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే మే 7 వరకు లాక్ డౌన్ పొడగించారు. దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఒకవేళ రద్దీ ఎక్కువైతే కాసేపు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.  మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

మద్యం దుకాణాల్లో అమ్మేవారితోపాటు కొనుగోలుదారులు అంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. మరోవైపు వైన్ షాపులు తప్ప బార్లు, రెస్టారెంట్లు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం

మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. మద్యం విక్రయాలపై అదనపు సర్‌చార్జీ విధిస్తున్నామని, ఫలితంగా మద్యం ధరలు పెరిగాయని అన్నారు. కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కాగా నేటి మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు సర్కార్ పేర్కొంది.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లంటే ఏమిటి ?

కరోనా పాజిటివ్‌ కేసులు, వారి కాంటాక్టులు నివసిస్తున్న చోటును కంటైన్‌మెంట్‌ కేంద్రంగా భావించాలి. అక్కడకు 500 మీటర్ల నుంచి ఒక కిలోమీటర్‌ పరిధిని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని బఫర్‌ జోన్‌గా గుర్తించాలి. పట్టణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత ఆధారంగా కాలనీ, మున్సిపల్‌ వార్డును కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా గ్రామ పంచాయతీ లేదా కొన్ని గ్రామాల సముదాయాన్ని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వర్గీకరణ

ఒక పాజిటివ్‌ కేసు నమోదైనప్పటి నుంచి ఐదు రోజుల్లో మరో పాజిటివ్‌ కేసు నమోదైతే వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా గుర్తించాలి. ఆరు నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైతే యాక్టివ్‌ యాక్టివ్‌ క్లస్టర్లుగా గుర్తించాలి.15–28 రోజుల మధ్య కేసులు నమోదైతే డార్మంట్‌ క్లస్టర్లగా గుర్తించాలి. 28వ రోజు తరువాత ఎలాంటి కేసులు నమోదు కాకపోతే కంటైన్‌మెంట్‌ కార్యకలాపాలను క్రమేణా తగ్గించాలి.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో పర్యవేక్షణ

యాక్టివ్‌ కేసులు తగ్గుతున్నాయంటే కోలుకుంటున్న, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు భావించాలి.కేసులు–కాంటాక్టుల నిష్పత్తి తక్కువగా ఉంటే కాంటాక్టులను గుర్తించే బృందాలను అప్రమత్తం చేయాలి. క్లస్టర్‌లోని హైరిస్క్‌ కేటగిరీ ప్రజలను గుర్తించి అందరికీ పరీక్షలు నిర్వహించాలి. కేస్‌ పాజిటివిటీ రేషియో (సీపీఆర్‌.. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లోని మొత్తం పాజిటివ్‌ కేసులు–మొత్తం పరీక్షల మధ్య నిష్పత్తి) ఎక్కువగా ఉంటే క్లస్టర్‌లో కమ్యూనిటీ వ్యాప్తి జరిగినట్లు గుర్తించాలి. సీపీఆర్‌ తక్కువగా ఉంటే రిస్క్‌ గ్రూపులలో తగినన్ని పరీక్షలు చేయలేదని భావించాలి. క్లస్టర్లలో కేసుల డబ్లింగ్‌ రేటును ప్రతి సోమవారం సమీక్షించాలి.

రాష్ట్ర సగటు రేటు ప్రస్తుతం 11.3 రోజులుగా ఉంది. ఈ రేటుకన్నా ఆ క్లస్టర్‌లో డబ్లింగ్‌ రేటు ఎక్కువగా ఉంటే భౌతిక దూరం, క్వారంటైన్‌ సదుపాయాలు, చికిత్సలపై దృష్టి పెట్టాలి. క్లస్టర్లలో నాలుగు వారాలు (28 రోజులు) ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోతే నియంత్రణ చర్యలను క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. ఈ మార్గదర్శకాల ఆధారంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 24 గంటల్లోగా ఈ మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలి.

జోన్ల వివరాలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 5 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. 7 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. ఒక జిల్లా మాత్రం గ్రీన్ జోన్‌లో ఉంది. రెడ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే దాన్ని ఆరెంజ్‌ జోన్‌గా మారుస్తారు. ఆరెంజ్ జోన్‌ ప్రాంతంలో 14 రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకపోతే దాన్ని గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారు. అంటే రెడ్ జోన్ గ్రీన్‌ జోన్‌గా మారాలంటే 28 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకూడదు. 28 రోజులపాటు కోవిడ్ కేసులేవీ నమోదు కాని జిల్లాను లేదా రాష్ట్రాన్ని గ్రీన్ జోన్‌గా పిలుస్తారు.