Corona in AP: ఏపీలో 18వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్తగా 1,506 కేసులు నిర్ధారణ, తాజాగా 1,835 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, ఈ నెల 21 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించిన ఏపీ ప్రభుత్వం
1,506 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,93,697 మంది వైరస్ (Corona in Andhra Pradesh) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,647కి చేరింది.
Amaravati, August 15: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65,500 పరీక్షలు నిర్వహించగా.. 1,506 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,93,697 మంది వైరస్ (Corona in Andhra Pradesh) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,647కి చేరింది.
24 గంటల వ్యవధిలో 1,835 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,62,185కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,56,61,449 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న ఈ కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.