AP Coronavirus Report: ఏపీలో కరోనాపై భారీ ఊరట, కొత్తగా 20,109 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 18,767 మందికి కోవిడ్ పాజిటివ్‌, 104 మంది మృతితో10,126కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

18,767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది.తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి (AP Covid) చేరింది.

COVID Outbreak - Representational Image (Photo-PTI)

Amaravati, May 23: ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,629 నమూనాలను పరీక్షించగా.. 18,767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది.తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి (AP Covid) చేరింది. కొత్తగా 104 మంది కరోనాతో మరణించడంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,126కి (Covid Dethas) పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,237 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, తాజాగా 20,109 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

మహమ్మారి కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమగోదావరిలో 13 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Here's AP Covid Report

గత 24 గంటల్లో అనంతపురంలో 1846 కేసులు, చిత్తూరులో 2323, ఈస్ట్ గోదావరిలో 2887, గుంటూరులో 1249, కడపలో 883, కృష్ణాలో 774, కర్నూలులో 1166, నెల్లూరులో 1045, ప్రకాశంలో 1162, శ్రీకాకుళంలొ 971, విశాఖపట్నంలో 1668, విజయనగరంలో 821, వెస్ట్ గోదావరిలో 1972 కేసులు నమోదయ్యాయి.