Corona in AP: ఏపీలో 20,184 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స, కొత్తగా 2,442 కరోనా కేసులు నమోదు, 24 గంటల్లో 2,412 మంది కోలుకుని డిశ్చార్జ్, ఏపీలో ఇప్పటి వరకు 2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు
16 మంది మృతి (16 deaths in last 24 hours) చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Amaravati, August 4: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 16 మంది మృతి (16 deaths in last 24 hours) చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,444కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,73,996 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,40,368 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,184 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు (Coronavirus in India) నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న 500కిపైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 42,625 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. నిన్న 562 మంది ప్రాణాలు (COVID 19 Deaths in India) కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 4,25,757కు చేరుకుంది. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగులక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,10,353 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతానికి పెరిగింది