IPL Auction 2025 Live

Andhra Pradesh: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా చంద్రబాబు, జగన్ పాలన చూసి నీకు దిక్కు తోచడం లేదు, టీడీపీ అధినేతపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు

MLA Kolusu Partha Sarathy Challenge to Chandrababu (Photo-File Image)

Vjy, Sep 14: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (MLA Kolusu Partha Sarathy) మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు. టీడీపీ (TDP) హయాంలో అమరావతిలోని 29 గ్రామాలకు ఏం మేలు జరిగింది?. చంద్రబాబుకు (Chandrababu) దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని పార్థసారథి సవాల్‌ విసిరారు.

చంద్రబాబుకి సీఎం జగన్ పాలన చూసి దిక్కు తోచడం లేదు. తమకు త్వరలో రాజకీయ సమాధి తప్పదని తెలిసి విద్వేష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. భవిష్యత్తులో ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలు రాకూడదని సీఎం జగన్‌ ఆలోచించారు. అమరావతి ఏర్పాటు చేయాలంటే లక్షన్నర కోట్లు కావాలి. ఇతర ప్రాంతాల అభివృద్ధిని తాకట్టు పెట్టే అమరావతి నిర్మాణం సాధ్యమా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

బ్యాంకులో రూ.42.79 కోట్ల మోసం కేసు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించిన సీబీఐ కోర్టు

విజయవాడ, గుంటూరు వాసులకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎందుకు అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అన్నప్పుడు ఈ మద్దతు పలుకుతున్న పార్టీలు ఏమయ్యాయి?. రాజధాని నిర్మాణం కోసం మీలా జోలె పట్టుకుని అడుక్కునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్లదు. ఇది చంద్రబాబు స్వార్థం కోసం ప్లాన్ చేసిన రాజధాని మాత్రమే. తనకు కావాల్సిన రియల్టర్స్ కోసం ఏర్పాటు చేసిన రాజధాని అది. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలన్నీ చర్చించండి. పారిపోయి బయట విద్వేష పూరిత రాజకీయాలు తగదు’’ అంటూ పార్థసారథి దుయ్యబట్టారు.

మీరు పాదయాత్ర రాయలసీమ, ఉత్తరాంధ్ర వారికి వ్యతిరేకంగా చేస్తున్నారా.?. నిజంగా మీకు ప్రజల నుంచి స్పందన ఉంటే మీరు బౌన్సర్‌లను పెట్టుకుని చేయాల్సిన కర్మ ఏమిటి?. మా పార్టీ లక్ష్యం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి. మీరు స్నేహం చేసిన బీజేపీ మేనిఫెస్టో కూడా కర్నూలు హైకోర్టు అని పెట్టారు. రాజధానిలో పేదలకు కూడా స్థానం ఉందని సీఆర్‌డీఏ చట్టాన్ని కూడా మార్పు చేసిన వ్యక్తి సీఎం జగన్‌’’ అని పార్థసారథి అన్నారు.



సంబంధిత వార్తలు

Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్‌ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్‌ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి