AP MPTC, ZPTC Election Results: పోస్టల్‌ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Visuals from a vote counting centre (Photo Credits: PTI)

Amaravati, Sep 18: రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు.

మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు (Andhra Pradesh MPTC, ZPTC Election Results) నిమిత్తం 209 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్‌ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు.

ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో (AP MPTC, ZPTC Election Polling) మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్‌ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది.

జస్టిస్‌ కనగరాజ్‌ నియామకంపై 4 వారాల పాటు స్టే విధించిన హైకోర్టు, సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఫలితాలు

అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్‌ ఆధిక్యం

అనంతపురం ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం

అనంతపురం తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం

అనంతపురం పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ

అనంతపురం కంబదూరు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

వైఎస్సార్‌ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

వైఎస్సార్‌ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.

పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు

పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

నెల్లూరు జిల్లాలో 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ) గెలుపు

నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం

జిల్లాల వారీగా ఈ స్థానాల్లో కౌంటింగ్

గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కడప: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 స్థానాలకు కౌంటింగ్‌

ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Cold Wave In Greater Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత, రాత్రి పూట మరింత తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Share Now