IPL Auction 2025 Live

Chintakayala Ayyanna Patrudu: టీడీపీకి మళ్లీ షాక్, బట్టలు ఊడదీస్తానని వార్నింగ్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనలు మరువక ముందే తెలుగుదేశం( Telugu desam Party) పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ (Vizag Munsipal Commissionar) తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై (Chintakayala Ayyanna Patrudu) నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు.

Chintakayala Ayyanna Patrudu (Photo-Twitter)

Amaravati, June 17: టీడీపీ నేతలకు (TDP Leaders) వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనలు మరువక ముందే తెలుగుదేశం( Telugu desam Party) పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ (Vizag Munsipal Commissionar) తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై (Chintakayala Ayyanna Patrudu) నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు, రేపు రానున్న ఫలితం, ఇద్దర్నీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన అధికారులు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ చేశారని ఆరోపణలు

మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఇటీవల ఆధునీకరిస్తుండడంతో హాల్‌లో ఉన్న అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడి ఫొటోను అధికారులు వేరే చోటికి మార్చారు. దాంతో ఆగ్రహించిన చింతకాయల తన తాత ఫొటో ప్రభుత్వ కార్యాలయంలో యథాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫొటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో పాటు ఆందోళనకు దిగారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌

నెల రోజుల్లో తన తాత ఫొటో యథాస్థానంలో పెట్టకపోతే మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయిందని… అదే మగాడై ఉంటే ఇప్పటికే ట్రీట్‌మెంట్‌ మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని బహిరంగంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో చింతకాయలపై నిర్భయ కేసు పెట్టారు.