Ramateertham Incident: రామతీర్థం రగడ, అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ టీడీపీ నేత

అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు

Ashok Gajapathi Raju (Photo-ANI)

Amaravati, Dec 24: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులను పోలీసులు (Andhra Pradesh Police) అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థం (Ramateertham Incident) బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజు (Ashok Gajapathi Raju) అడ్డు తగిలారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆలయ ఈవో ప్రసాద్‌ ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో నెలిమర్ల పోలీస్‌ స్టేషన్‌లో అశోక్‌ గజపతిరాజు కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్‌ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.

అనుకున్న సమయానికే..పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం, ట్రయల్ రన్ సక్సెస్, . ఏడంతస్తుల రథం పూర్తి స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి

రామతీర్థం రగడపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ.. హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్‌ వేశారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. తనకు 41ఏ నోటీసును పోలీసులు ఇచ్చారని చెప్పారు.

400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ పరువు, సంస్కారాలను దెబ్బతీసేలా... తమది దేశద్రోహుల కుటుంబం అని అంటున్నారని మండిపడ్డారు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఆలయానికి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఆలయాలకు సంబంధించి ఏ విషయం అడిగినా అధికారులు చెప్పడం లేదని అన్నారు. సింహాచలం ఆలయానికి కూడా తాను టోల్ గేట్ కట్టే వెళ్తున్నానని... టోల్ గేట్ కట్టకపోతే తనపై మరో కేసు పెడతారని ఎద్దేవా చేశారు. తనను కేసులతో వేధిస్తున్నారని ఆయన అన్నారు.