Mekapati Vikram Reddy: వీధికుక్కల ప్రచారం పట్టించుకోను, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి, మా కుటుంబం జగన్ వెంటేనని స్పష్టం

వీధికుక్కల ప్రచారం పట్టించుకోమని.. సీఎం జగన్‌ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను.

Mekapati Vikram Reddy (Photo-Video Grab)

Nellore, Mar 31: పార్టీ మార్పు వార్తలపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోమని.. సీఎం జగన్‌ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను.

పోలవరం నిధులను విడుదల చేయండి, కేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ, విభజన హామీలపై విజ్ఞప్తి

బాబాయ్‌ చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుంది. పార్టీ లైన్‌ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవని విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్‌తోనే ఉంటుందని, ఆయన వెంటే నడుస్తుందని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Here's Video

జిల్లా పరిణామాలపైనా స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి.. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి సీఎం వైఎస్‌ జగన్‌కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు, రైతన్నలో ఆందోళన

పార్టీ ద్రోహి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్‌సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డి వర్సెస్‌ వైఎస్సార్‌సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీశారు.



సంబంధిత వార్తలు