New Delhi, March 30: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ (Jagan Meets Amith Shah) అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై(Polavaram) చర్చించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 3 వేట కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఆ నిధులను విడుదల చేసేలా చొరవ చూపాలని అమిత్ షాను జగన్ (Jagan Meets shah) కోరారు. విభజన హామీలను నెరవేర్చాలంటూ జగన్ విన్నవించారు. ఢిల్లీలోని అమిత్ షా అధికారిక నివాసంలో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రధానంగా ఏపీ అభివృద్ధి, పెండింగ్ నిధుల అంశాలకు సంబంధించి అమిత్ షాతో సమావేశం కొనసాగుతోంది. రాజకీయంగానూ, రాష్ట్ర అభివృద్ధి అంశానికి సంబంధించి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలకు సంబంధించి పదేళ్ల కాల పరిమితి పూర్తి కావస్తోంది. కాబట్టి ఏపీకి సంబంధించి ఇంకా అనేక అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం. pic.twitter.com/kqe6AMxlit
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 29, 2023
ఇటీవల మార్చి 17వ తేదీన ప్రధానమంత్రి మోదీతో (PM Modi) ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలకు సంబంధించి కూడా అమిత్ షాతో జగన్ సమీక్షిస్తున్నారు. విభజన చట్టంలో పొందుపర్చిన పలు అంశాలు ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అంశాన్ని ప్రధాని మోదీకి దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నిధులు, ప్రతి జిల్లాకు మెడికల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు, కడప స్టీల్ ప్లాంట్ వంటి అనేక అంశాలకు సంబంధించిన 14 విజ్ఞాపనలను మార్చి17న ప్రధాని మోదీకి సీఎం జగన్ అందించారు. వాటన్నింటినీ సీఎం జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా కూడా ఈ భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. పొలిటికల్ అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.