Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన తెలుగుదేశం పార్టీ

ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.

Kotamreddy Sridhar Reddy (Photo-Video Grab)

Nellore, July 25: తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా.. కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కోటంరెడ్డి కూడా తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశారు.