Nellore Politics: నువ్వు అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం, ఆనంపై విరుచుకుపడిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించిందని సెటైర్స్

రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారని నేదురుమల్లి మండిపడ్డారు.

Nedurumalli-Ramkumar Reddy (Photo-Video Grab)

Nellore, Feb 2: నెల్లూరు జిల్లాలో వైసీపీలో ఎమ్మెల్యేల అంశం కలకలం రేపుతోంది. నేరుగా పార్టీ అధిష్ఠానంపై ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (Anam Ram narayana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు వెంకటగిరి నియోజకర్గంలో ఆనంకు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని (nedurumalli ramkumar) ప్రోత్సహిస్తోంది.ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డిపై నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్‌ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషంగా ఉందని తెలిపిన ఆదాల

రాజ్యాంగం గురించి ఆనం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా, నేదురుమల్లి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వెంకటగిరి నియోజకవర్గంలో మేము పనిచేస్తే గెలిచావు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దయతలచి సీటు ఇచ్చారు. గెలిచిన మొదటి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. తప్పుడు ఆరోపణలు ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోందని ఇప్పుడు చెబుతున్నారు. నీ తప్పులనీ బయటకు వస్తున్నాయి. కాంట్రాక్ట్‌ల విషయాలు కూడా బహిర్గతమవుతున్నాయి.

అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి. వయసు పైబడటంతో ఆనం బుద్ది మందగించింది. వెంకటగిరి నక్సల్‌ ప్రాంతమని ఆనం మాట్లాడుతున్నారు. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారు. ముందునుంచే శ్రీధర్‌ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు. ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Share Now