CM Jagan Slams Chandrababu: పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తూ రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబుపై మండిపడిన సీఎం జగన్, వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి
Kakinada, Jan 3: కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (YSR Pension Donation Enhancement Program) వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్ (CM Jagan Mohan ReddY). సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో (CM Jagan Slams Chandababu) పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా?. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని తెలిపారు.
గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు.
53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నామని తెలిపారు.
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్ మోహన్ రెడ్డి
చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు.
ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు.
27,61,000 మంది పిల్లలకు మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్
‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.