YS Jagan's Security Row: దేవాన్స్‌కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్‌కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు

కానీ వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Ambati Rambabu (photo-Video Grab)

Vjy, August 7: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎస్‌ఆర్‌సీ రిపోర్టు రాకుండానే వైఎస్‌ జగన్‌ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని మండిపడ్డారు. జగన్‌ ఓడిపోయాడు.. కానీ చావలేదని స్వయంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని.. ఇలాంటి పరిస్థితుల్లోనే సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామని చెప్పారు.వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మంది సెక్యూరిటీ ఉన్నారని ప్రచారం చేశారని గుర్తుచేశారు. అప్పట్లో జగన్‌కు ఉన్నది కేవలం 139 మంది సెక్యూరిటీనే అని స్పష్టం చేశారు. భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని రీప్లేస్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం

నారా లోకేశ్‌ కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒక డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ తెచ్చుకున్నారని అన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ఎవరూ తగ్గించమని కోరలేదని పేర్కొన్నారు. మరి ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సెక్యూరిటీని ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు.

Here's Videos

హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తుచేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు