Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Subramanian Swamy |(Photo Credits: Facebook)

Vjy, Feb 25: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్‌, ప్రముఖ లాయర్‌ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy)తెలిపారు. ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్‌సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు.మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారు.

వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్

ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.

 YSRCP should be given opposition status

ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ఆయన వేసిన పిల్‌ మార్చి 12వ తేదీన విచారణకు రానుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖ‌తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Share Now