Andhra Pradesh Rains: వరదలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 మంది మృతి, 6,44,536 మందిపై తీవ్ర ప్రభావం చూపిన భారీ వర్షాలు, 2.34 లక్షల మంది రైతులకు తీవ్ర నష్టం

ముఖ్యంగా బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Andhra Pradesh Rains (Photo-Video Grab/X/YSRCP)

Vjy Sep 4: ఏపీలో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా బెజవాడ వాసులను బెంబేలెత్తించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.  విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తుపానుగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అలర్ట్

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. 2.34 లక్షల మంది రైతులు భారీ వరదలకు నష్టపోగా 60వేల కోళ్లు, 222 పశువులు మృతిచెందాయి. వరదల వల్ల 22 సబ్‌స్టేషన్‌లు, 3,312 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారు.

మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..

193 రిలీఫ్‌ క్యాంపుల్లో 42,707 మంది ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్‌కు వినియోగిస్తున్నాం. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif