Corona in AP: ఏపీలో తాజాగా 1,217 మందికి కరోనా, 13 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్‌ కేసులు, 200,1255కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,217 కేసులు (Corona in AP), 13 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus test (Photo-ANI)

Amaravati, August 21: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్‌ కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,217 కేసులు (Corona in AP), 13 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 200,1255కి చేరగా.. మరణాల సంఖ్య 13,715కి పెరిగింది. కొత్తగా మరో 1535 మంది బాధితులు వైరస్‌ (Coronavirus in Andhra Pradesh) నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రికవరి అయినవారి సంఖ్య 19,72,399కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,141 యాక్టివ్‌ కేసులున్నాయి.

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ముందు రోజుతో పోలిస్తే కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 13,21,205 మందికి పరీక్షలు నిర్వహించగా 34,457 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి, నిన్న ఒక్క రోజే 375 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.23 కోట్లు దాటాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4.33 లక్షలకు చేరింది. దేశంలో ప్రస్తుతం 3,61,340 యాక్టివ్‌ కేసులు ఉ‍న్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif