Corona in AP: రోజు రోజుకు డేంజర్‌గా మారుతున్న డెల్టా వేరియంట్, ఆస్పత్రిపాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనంలో వెల్లడి, ఏపీలో తాజాగా 1,321 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులు
1,321 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,10,566 మంది (Coronavirus) వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Amaravati, August 28: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా.. 1,321 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,10,566 మంది (Coronavirus) వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,499 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,81,906కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,71,272 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్ మహమ్మారి బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ శనివారం కొనసాగుతోంది.18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం 2వేలకు పైగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక, ఏపీలో ఇప్పటివరకూ 2.77 కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ అందించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ (Delta Variant) సోకిన రోగులు ఆస్పత్రిపాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో 40,000 కొవిడ్-19 కేసుల వివరాలను పరిశీలించిన మీదట లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయం నిగ్గుతేల్చింది. అల్ఫా స్ట్రెయిన్‌తో పోలిస్తే డెల్టా సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో బాధపడతారని గతంలో వెల్లడైన అంశాలను తాజా అధ్యయనం నిర్ధారించింది.
అధ్యయనంలో పాల్గొన్నవారిలో పలువురు వ్యాక్సినేషన్ పూర్తికాని కేసులో ఉన్నా డెల్టా తీవ్రతను ఇది వెల్లడిస్తోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ ఇన్ఫెక్షన్ సర్వీస్ కన్సల్టెంట్ ఎపిడెమాలజిస్ట్ గవిన్ డబ్రెరా పేర్కొన్నారు. డెల్టా నుంచి వ్యాక్సినేషన్ మెరుగైన రక్షణ కల్పిస్తోందని, బ్రిటన్‌లో నమోదవుతున్న కేసుల్లో 98 శాతం పైగా డెల్టా కేసులే ఉన్నందున ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవడం శ్రేయస్కరమని డబ్రెరా కోరారు. ఇక అధ్యయన సమయంలో తాము 34,656 అల్ఫా కేసులు., 8682 డెల్టా కేసులను పరిశీలించామని తెలిపారు.