COVID-19 in AP: కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా, భర్తకు కరోనా రావడంతో కేసీలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ, ఏపీలో తాజాగా 10,603 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,24,767 కు (coronavirus positive cases) చేరింది. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది. తాజా పరీక్షల్లో 33,823 ట్రూనాట్ పద్ధతిలో, 29,254 పద్ధతిలో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,21,754. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Amaravati, August 30: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 63,077 నమూనాలు పరీక్షించగా 10,603 పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,24,767 కు (coronavirus positive cases) చేరింది. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది. తాజా పరీక్షల్లో 33,823 ట్రూనాట్ పద్ధతిలో, 29,254 పద్ధతిలో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,21,754. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి (Kottapet MLA Chirla jaggireddy) కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు (COVID-19 in Andhra Pradesh) పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్
తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
భర్తకు కరోనా రావడంతో కేసీలో దూకి మహిళ ఆత్మహత్య విషాద సంఘటన కర్నూలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో గురువయ్య, రాజ్యలక్ష్మి (68) దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితమే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కోడలు, మనవడి వద్ద ఉంటున్నారు. గురవయ్యకు ఇటీవల కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్‌లో ఉంటున్నాడు. పోలీస్ శాఖలో కరోనా కల్లోలం
ఈ క్రమంలో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. చనిపోవాలని నిర్ణయించుకుని శనివారం ఉదయం బయటకొచ్చి పడిదెంపాడు వద్ద కేసీ కెనాల్‌లో దూకింది. అటువైపు వస్తున్న ఆటో డ్రైవర్ గమనించి వెంటనే నీటిలోకి దూకి బయటకు తీసుకొచ్చాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కరోనా సోకిందని తేలగానే ఇరువురం చనిపోదామంటూ రాజ్యలక్ష్మి భర్తతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.