AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,539 కోవిడ్ కేసులు, 12 మరణాలు నమోదు మరియు 1,140 మంది రికవరీ, రాష్ట్రంలో 14,448కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

అయితే నమోదయ్యే కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య తక్కువ అవుతుండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు నెమ్మదిగా పెరుగుతుండటం గమనార్హం....

Representational Image | (Photo Credits: PTI)

Amaravathi, August 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉంది. ఇటీవల కాలంగా రోజూవారీ కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి, ప్రతిరోజు సుమారు 15 వందల మేర కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే నమోదయ్యే కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య తక్కువ అవుతుండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు నెమ్మదిగా పెరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మరింత వ్యాప్తి జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,590 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,539 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,07,730కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,04,835 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి 243, తూర్పు గోదావరి జిల్లా నుంచి 228, కృష్ణా జిల్లా నుంచి 194, నెల్లూరు నుంచి 176 కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 12 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,778కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,140 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,79,504 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,448 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif