Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, కొత్తగా 1,540 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 2,304 మంది కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు
19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Amaravati, July 27: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 61,298 మంది నమూనాలు పరీక్షించగా 1,540 కొత్త కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,304 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు,వైయస్సార్ కడపలో ఒకరు, శ్రీకాకుళంలొ ఒకరు మృతి చెందారు. నేటి వరకు రాష్ట్రంలో 2.42, 53, 931 టెస్టులు నిర్వహించారు. రూ. 20 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ, ఆగస్టు 16న విద్యా కానుక, ఆగస్టు 10న నేతన్న నేస్తం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
19 మంది మరణాలతో రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 13, 292కు చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,22, 95,988 మందికి వ్యాక్సిన్ వేశారు. కరోనా నుంచి కోలకున్న వారి సంఖ్య 19, 20, 780కు చేరారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా సోమవారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 11,50,911 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో లక్షా 90 వేల మందికి టీకాలు వేశారు. గత నెలలో 13.72 లక్షల మందికి ఒకే రోజు టీకాలు వేసిన విషయం విదితమే