Corona in Andhra Pradesh: చిత్తూరులో ఇంకా తగ్గని కరోనా, జిల్లాలో తాజాగా 255 కేసులు, ఏపీలో 24 గంటల్లో 878 కోవిడ్ కేసులు, 13 మంది మ‌ృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 13 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Coronavirus Outbreak (Photo credits: IANS)

Amaravati, August 30: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 13 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య13,838 కు చేరింది. గత 24 గంటల్లో 1,182 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,81,406 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,862 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,10,106 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,65,76,995 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ విద్యుదుత్పాదన తక్షణమే నిలుపుదల చేయండి, కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాసిన ఏపీ జలవనరుల శాఖ, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని లేఖలో ఆందోళన

కోవిడ్ తో గత 14 గంటల్లో కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో 1, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, కడపలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 2

చిత్తూరు - 255

తూర్పుగోదావరి - 166

గుంటూరు - 85

కడప - 67

కృష్ణా - 42

కర్నూలు - 3

నెల్లూరు - 61

ప్రకాశం - 96

శ్రీకాకుళం - 24

విశాఖపట్నం - 50

విజయనగరం - 4

పశ్చిమగోదావరి - 23