Corona in Andhra Pradesh: గోదావరి జిల్లాలో ఇంకా తగ్గు ముఖం పట్టని కరోనా, ఏపీలో తాజాగా 1,601 మందికి కోవిడ్, కరోనావైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

Amaravati, August 25: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,766 కు చేరింది. గత 24 గంటల్లో 1,201 మంది (1201 recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,78,364 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,061 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,06,191 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,62,70,356 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 273 కేసులు నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 221 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరులో 208 కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి.

ప్రమాదకరంగా మారుతున్న డెల్టా ప్లస్ వేరింయట్, దేశంలో 37,593 కొత్త కరోనా కేసులు, 648 మంది మృతి, మహారాష్ట్రలో ఒకే రోజు 27 కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 26

చిత్తూరు - 217

తూర్పుగోదావరి - 273

గుంటూరు - 123

కడప - 108

కృష్ణా - 116

కర్నూలు - 10

నెల్లూరు - 208

ప్రకాశం - 124

శ్రీకాకుళం - 37

విశాఖపట్నం - 98

విజయనగరం - 40

పశ్చిమగోదావరి - 221

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని తన నివాసంలో బుధవారం సీఎం జగన్‌ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, సీజనల్‌ వ్యాధుల నివారణ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష చేశారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

ఈ సందర్భంగా కరోనాపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడారు. ‘గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనం కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం పర్యవేక్షణ, సమీక్షచేయాలి. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ మనం అప్రమత్తంగానే ఉండాలి.

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి. పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలి. పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలి. విద్యాసంస్థల్లో ఎస్‌ఓపీలను తప్పకుండా పాటించాలి. ఫోకస్‌గా టెస్టింగ్‌ చేయాలి. ఇంటింటికీ సర్వేలు కొనసాగాలి. ఎవరికి లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయాలి. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్‌చెప్తే... మార్గదర్శకాల ప్రకారం అక్కడ పరీక్షలు చేయాలి. విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే పరీక్షలు చేయాలి. 104 టోల్‌ఫ్రీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. నిర్దేశించుకున్న ఎస్‌ఓపీలను పాటించాలి. ఎవరైనా ఫోన్‌చేసినప్పుడు నిర్దేశించుకున్న ప్రోటోకాల్స్‌ పాటించాలి. కోవిడ్‌ తగ్గింది కాబట్టి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు.

కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

‘థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదు గానీ మనం మాత్రం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ కూడా ఇవ్వాలి. బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్‌సంట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవాలి. 100 బెడ్లు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటివరకూ 71,03,996 మందికి డబుల్‌ డోస్, 1,18,53,028 మందికి సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చాం.

85 శాతం ప్రజలకు డబుల్‌డోస్‌ ఇచ్చేంతవరకూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంటిలో ఉన్నవారికీ వ్యాక్సిన్లు పూర్తిచేసేలా ముందడుగు వేయండి. దీనివల్ల వ్యాక్సిన్ల వృథాను అరికట్టగలుగుతాం. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. వర్షాకాల సమావేశాల్లో వచ్చే వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అన్నిరకాల చర్యలు తీసుకోండి. పారిశుద్ధ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి’ అని సీఎం జగన్‌ తెలిపారు.