COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,843 కోవిడ్ కేసులు, 12 మరణాలు నమోదు మరియు 2,199 మంది రికవరీ, రాష్ట్రంలో 23,571గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ ఈనెల చివరి వరకు ..

Representational Image | (Photo Credits: PTI)

Amaravathi, July 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉభయగోదావరి జిల్లాలు సహా దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా అదుపులోకి వస్తుంది. అయితే రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరు తమ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూ ఈనెల చివరి వరకు అమలులో ఉండనుంది. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 77,727 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 1,843 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19,48,592కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 19,45,697గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 301 కోవిడ్ కేసులు నమోదు కాగా..  పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 235, తూర్పు గోదావరి జిల్లా నుంచి 222, ప్రకాశం 232 మరియు నెల్లూరు నుంచి 203 కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 12 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,209కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2,199 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,11,812 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 23,571 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.



సంబంధిత వార్తలు

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

PAC Elections: వైసీపీ సంచలన నిర్ణయం, పీఏసీ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Gautam Adani Bribery Case: లంచం ఆరోపణలను ఖండించిన వైసీపీ, అదాని గ్రూపుతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటన, సెకీతోనే ఒప్పందం చేసుకున్నామని వెల్లడి

KCR: దటీజ్ కేసీఆర్, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్...గులాబీ బాస్ వ్యూహంతో వెనక్కి తగ్గిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో టచ్‌లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు!