COVID-19 in AP: ఏపీలో తాజాగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1913 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, 2787కి చేరిన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Covid 19 in AP) 2787కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 58 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 816 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1913 మంది బాధితులు కోలుకున్నారు.

COVID-19 | (Photo Credits: IANS)

Amaravati, May 27: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదవగా, ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Covid 19 in AP) 2787కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 58 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 816 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1913 మంది బాధితులు కోలుకున్నారు. లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశ వ్యాప్తంగా 4,337 మంది మృతి

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రోజు కరోనాతో చనిపోయాడు. గత 24 గంటల్లో 10 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 8, చిత్తూరులో 1 మొత్తం 9 కేసులు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినట్లుగా నిర్థారించారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతి (COVID-19 Deaths) చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Here's AP Corona Report

ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic India) ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా రోజువారి కేసుల సంఖ్యలో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది.