Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 739 మందికి కోవిడ్, గత 24 గంటలలో కరోనాతో 14 మంది మృతి, రాష్ట్రంలో ప్రస్తుతం 14,550 యాక్టివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో 43,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 739 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 14 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,925 కు చేరింది.
Amaravati, Sep 6: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 43,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 739 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 14 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,925 కు చేరింది. గత 24 గంటల్లో 1,333 మంది ( recoveries) కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,93,589 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,550 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,22,064 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,69,82,681 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 166 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో58 కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 94 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ తో గత 24 గంటల్లో చిత్తూరులో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు,అనంతపూర్ లో ఒకరు,తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.
గత 24 గంటల్లో కేసులు వివరాలు
అనంతపూర్ - 3
చిత్తూరు - 166
తూర్పుగోదావరి - 58
గుంటూరు - 66
కడప - 98
కృష్ణా - 64
కర్నూలు - 0
నెల్లూరు - 114
ప్రకాశం - 94
శ్రీకాకుళం - 11
విశాఖపట్నం - 54
విజయనగరం - 2
పశ్చిమగోదావరి - 9