COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సెకండ్ వేవ్ తీవ్రత, కొత్తగా 9,881 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 95 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య, కంటైన్‌మెంట్ జోన్‌గా తిరుపతి!
తిరుపతిలోనూ ఆంక్షలు కఠినతరం చేయబడ్డాయి. మున్సిపల్ కమిషనర్ గిరిషా తిరుపతి నగరాన్ని కంటెమెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు....
Amaravathi, April 26: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నివారణ చర్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆక్సిజన్ వృధాపై దృష్టి సారించి దాన్ని అధిగమించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లకు కొరత లేదని స్పష్టం చేశారు. 40 పడకలున్న ఆస్పత్రులను కోవిడ్ కేంద్రాలుగా అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే అన్ని కోవిడ్ నిర్ధారణ అయిన పేషెంట్ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ అందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 24 గంటల్లోనే పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. 104 కు కాల్ చేసిన మూడు గంటల్లో పడకలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలలో సీటీ స్కాన్ ధరలు 3 వేలకు మించరాదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ఎలాంటి వేడుకకైనా 50 మంది మించకూడదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇక తిరుపతిలోనూ ఆంక్షలు కఠినతరం చేయబడ్డాయి. మున్సిపల్ కమిషనర్ గిరిషా తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల వచ్చే భక్తులు కరోనావైరస్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కమిషనర్ సూచించారు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,041 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 9,881 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఏపి ఒకరోజులో నమోదు చేసిన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 10,43,441కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 10,40,546గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు నెల్లూరు జిల్లా నుంచి అత్యధికంగా 1592 కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరి నుంచి 1,302, గుంటూరు నుంచి 1,048, మరియు విశాఖపట్నం నుంచి 1030 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 51 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,736కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 4,431 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 9,40,574 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 95,131 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)