Vijayawada Bus Accident: బస్సు గేర్ సరిగా పడకపోవడం వల్లే ప్రమాదం, విజయవాడ బస్టాండ్ ప్రమాద ఘటనపై స్పందించిన ఆర్టీసీ ఎండీ, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

12వ ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌తో పాటు ఓ మహిళ చెందారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Three killed as RTC bus rams into platform in Vijayawada bus station

Vjy, Nov 6: విజయవాడ నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌తో పాటు ఓ మహిళ చెందారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మృతిచెందిన మహిళను చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్‌ క్కర్ల్‌ను గుంటూరు-2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్‌ (18 నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. సుకన్య కాలు విరిగింది. అయాన్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు.

బస్సు డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌కు బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 11, 12 ప్లాట్‌ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్‌, కుర్చీలు ధ్వంసమయ్యాయి. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)

ఘటనాస్థలాన్ని ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై 24 గంటల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేస్తామన్నారు.

Here's Disturbed Videos

ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఆటోనగర్‌కు‌ చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుంది. బస్సు రివర్స్ చేసే క్రమంలో ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లింది. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారు. సాయంత్రానికి వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం. అవుట్ సోర్సింగ్ కండక్టర్ వీరయ్య, మహిళ కుమారి, చిన్నారి చనిపోయారు. ఆర్టీసీ కార్పొరేషన్ తరపున మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తాం. గాయపడ్డ వారికి వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తాం. బస్సులు కంట్రోల్ స్పీడ్‌లో వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. బస్టాండు సమీప ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం.

ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల పసి పాప

బస్టాండులో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. డ్రైవర్ ఇటీవల సిక్‌లో ఉండి... ‌కోలుకుని విధులకు వచ్చాడు. ఆల్కహాల్ టెస్ట్ చేశాకే డ్రైవర్‌కు బస్సు అప్పగిస్తాం. డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే... ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నాం. బస్సు కండీషన్ బాగానే ఉందని నాకున్న సమాచారం. నిపుణులు నివేదికను బట్టి ఎవరి తప్పో తేలుతుంది.

వయసు రిత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తాం. ఫిట్ నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నామనేది కరెక్ట్ కాదు. బస్సు కండీషన్ కూడా పరిశీలించి రూట్లను నిర్ధారిస్తాం. నెలకు మూడు వందల బస్సులు ఈనెల నుంచి కొత్తగా వస్తున్నాయి. కచ్చితంగా ఈ ప్రమాదం పొరబాటున జరిగింది. కారణాలు తెలిశాక చర్యలు తీసుకుంటాం. ఈ ఒక్క ఘటనతో ప్రజలు భయపడవద్దు’’ అంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif