AP Local Body Polls 2021: ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా, నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు, 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్ఈసీ

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Dubbak by-poll on November 3 (Photo-Facebook)

Amaravati, Nov 1: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ (AP Local Body Polls 2021) విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ దఫా 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న కౌంటింగ్‌ జరపనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి రానుంది. అకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.