Corona in AP: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో గత రికార్డును బ్రేక్ చేసిన జగన్ ప్రభుత్వం, ఒక్కరోజులోనే 11 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్, ఏపీలో తాజాగా 5,646 కరోనా కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు (Andhra Pradesh sees 5,646 COVID cases) నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Vaccination Drive. (Photo Credits: IANS)

Amaravati, June 20: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు (Andhra Pradesh sees 5,646 COVID cases) నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 7,772 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,098 కొత్త కేసులు నమోదు కాగా, అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 127 కేసులు గుర్తించారు. చిత్తూరు (890), పశ్చిమ గోదావరి (761) జిల్లాల్లో 500కి పైన కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 12,319కి పెరిగింది.

జగన్ సర్కారు మరో కీలక వ్యూహం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త ఎత్తుగడ, వర్చువల్‌గా రోడ్‌షోలు, డిప్లొమాటిక్‌ సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఏపీ ఈడీబీ

ఏపీలో ఇప్పటిదాకా 18,50,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,75,176 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 63,068 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్క రోజే 11 లక్షల వ్యాక్సినేషన్ ఇచ్చి రికార్డ్ సృష్టించారు.

Here's Covid Updates

మొత్తం 2 వేల 232 కేంద్రాల్లో టీకా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గత రికార్డ్‌ని బ్రేక్ చేసింది. గతంలో ఒకే రోజులో 6 లక్షల 28 వేల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని బ్రేక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ 11 లక్షల మార్క్‌ని దాటేసింది. ఉదయం నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. డ్రైవ్ ముగిసే సరికి 12 లక్షల మార్క్‌ను అందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది.

ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

అంతకుముందు తిరుపతి నెహ్రూ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని అనిల్‌ సింఘాల్‌ పరిశీలించారు. వ్యాక్సిన్‌ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం అందించగలిగితే ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 96 లక్షల మందికి మొదటి డోసు డోసు వేసినట్లు అనిల్‌ సింఘాల్‌ చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని అనిల్‌ వెల్లడించారు.

రేపటి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అంగీకారం తెలిపిన కేసీఆర్ సర్కారు, కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా నడవనున్న ఆర్టీసీ బస్సులు, బెంగుళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌‌ఆర్టీసీ బస్‌ సర్వీసులు

థర్డ్‌ వేవ్‌ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందనేది నిజం కాకపోవచ్చన్నారు. పిల్లలపై థర్డ్‌ వేవ్‌ ప్రభావమనే ఉహాగానాలను ఎయిమ్స్‌ వైద్యులు కొట్టిపారేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు 60వేల ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను ఆర్డర్‌ చేసినట్లు అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Share Now