Representational Image| file Photo

Hyderabad, June 20: తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు (Inter-State Transmission) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) నేటి నుంచి ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి బస్సులు (TSRTC buses from telangana to AP) నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈనేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు

కర్ఫూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు యాణికులు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

దీంతో పాటుగా కర్ణాటక నిబంధనలకు అనుగుణంగా రేపట్నుంచి టీఎస్‌ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఉదయం 5గంటల నుంచి సాయత్రం 7గంటల వరకు మాత్రమే బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌ ఆర్టీసీ బస్‌ సర్వీసులు ఉంటాయి. కర్ఫ్యూ దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.