Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లాలో దారుణం, బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని, చివరిదాకా కనుక్కోలేకపోయిన టీచర్లు
కాగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత రెండు నెలలుగా హాస్టల్‌లోనే ఉంటోంది.
ప్రకాశం, ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని మృత శిశువుకు జన్మనిచ్చింది. కాగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత రెండు నెలలుగా హాస్టల్‌లోనే ఉంటోంది.
పాఠశాల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థిని కడుపునొప్పితో బాధపడుతోందని, బాత్రూమ్‌కు తీసుకెళ్లగా, అక్కడ ఆమె చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. చాలా సేపటి తర్వాత తరగతి గదికి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో బుధవారం ఈ ఘటన జరిగింది. వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు
చీమకుర్తి మండలానికి చెందిన విద్యార్థిని జూన్ 19న కేజీబీవీలో చేరి రెగ్యులర్‌గా తరగతులకు హాజరవుతోంది. వారం రోజుల పాటు ఇంటికి వెళ్లి హాస్టల్‌కు చేరుకుని అక్కడ ఇతర విద్యార్థినులతో కలిసి ఉంటోంది. విద్యార్థిని గర్భం దాల్చిన విషయం తమకు తెలియదని, ఆమె తన తరగతి గదికి తిరిగి రాకపోవడంతో జరిగిన విషయం తెలిసిందని పాఠశాల అధికారులు పేర్కొన్నారు.
విద్యార్థినిని వైద్యం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని కళాశాల వాష్‌రూమ్‌లో పదహారేళ్ల బాలిక ప్రసవించినట్లు కొత్తపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ తెలిపారు. ఎంతసేపటికి ఆమె వాష్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కళాశాల సిబ్బంది గమనించారు. ఒక లేడీ లెక్చరర్ లోపలికి వెళ్లి చూసింది.
ఆమె పక్కన ఒక మగ శిశువు చనిపోయి ఉంది. వారు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చీమకుర్తికి చెందిన ఓ వ్యక్తి హస్తం ఉన్నట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.