Krishna Shocker: ప్రేమ పేరుతో కామ కోరికలు తీర్చుకున్నాడు, పెళ్లి పేరెత్తితే కులం పేరెత్తాడు, మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు, నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు
ఓ యువకుడు పెళ్లి పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసి ఆ తరవాత పెళ్లి పేరెత్తితే మొహం చాటేసాడు.
Amaravati, May 11: కృష్ణా జిల్లా కైకలూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పెళ్లి పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసి ఆ తరవాత పెళ్లి పేరెత్తితే మొహం చాటేసాడు. కైకలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కైకలూరులోని కాళ్లపాలెం పంచాయతీ శివారు చింతలమూరుకి చెందిన దళిత మైనర్ బాలిక(17)ను సానారుద్రవరానికి చెందిన గంగుల జగదీష్(22) అనే యువకుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తరువాత పెళ్లి పేరెత్తితే దూరంగా వెళ్లిపోవడం (Cheated Minor Girl) ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో బాలిక (Minor Girl) తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీకి చెందిన నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు అంటూ జగదీష్ ఇప్పుడు నిరాకరిస్తున్నాడని బాలిక తల్లి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ జనార్థన్ ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు (Case Filed Against Man) చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపామని, డీఎస్పీ సత్యానందం కేసు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.
ఇక మరో చోట కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ రణవీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అన్నదమ్ములైన రవీందర్, మహేందర్, ప్రసాద్ (21) తల్లితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్ తరచుగా డబ్బు విషయమై అన్నలతో, తల్లితో గొడవ పడుతుండటంతో రవీందర్ జీడిమెట్లకు మకాం మార్చాడు.
అయినప్పటికీ ప్రసాద్ మద్యం సేవించి వచ్చి తరచుగా మరో అన్న మహేందర్, వదిన, తల్లితో గొడవ పడుతుండటంతో వారు కూడా ఇల్లు మారారు. ఇంట్లో ఒక్కడే ఉంటున్న ప్రసాద్ తన ప్రవర్తన మార్చుకోకుండా మహేందర్ వద్దకు వెళ్లి తల్లిని, అన్నను తరచుగా తిడుతుండడంతో మహేందర్ జీడిమెట్లలో ఉన్న రవీందర్‌కు ఫోన్‌చేసి మాట్లాడేందుకు రావాలని కోరాడు.
ఆదివారం రాత్రి రవీందర్, మహేందర్ కలిసి ప్రసాద్ ఇంటికి వెళ్లగా మద్యం సేవించి ఉన్న ప్రసాద్ వారితో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రవీందర్, మహేందర్, ప్రసాద్ మెడను చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు