Representational Image (Photo Credits: Pixabay)

Lucknow, May 11: యూపీలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్మశానాల్లో మృతదేహాల దుస్తులు దొంగలించి వేరే కంపెనీ ట్రేడ్‌మార్క్ వేసి అమ్ముతున్న కొందరు నిందితులను పోలీసులు అరెస్టు (Cloth Merchant, Six Others people arrested) చేశారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అరెస్టు చేసిన నిందితులు చనిపోయినవారి మృతదేహాల నుండి చీరలు, బెడ్‌షీట్లు మరియు ఇతర బట్టలు కాకుండా చనిపోయినవారిని కవర్ చేయడానికి ఉపయోగించే దుస్తులను ( stealing clothes from dead ) దొంగిలించేవారు

ఈ దుస్తులను ఉతకడం మరియు ఇస్త్రీ చేసి దుకాణాలకు విక్రయించేవారు. ఈ ప్రాంతంలోని కొంతమంది వస్త్ర వ్యాపారులు ఈ వ్యక్తుల నుండి దొంగిలించబడిన బట్టలు కొనుగోలు చేస్తారని పోలీసులు తెలిపారు. వీళ్లంతా స్మశానాల్లో దూరి అక్కడ ఉన్న దుస్తులను తీసుకొచ్చి, ఒక దుకాణ దారుడికి అప్పగించేవారు. సదరు దుకాణదారుడు ఆ వస్త్రాలకు కంపెనీ ట్రేడ్‌మార్క్ తగిలించి అమ్మేయడం ప్రారంభించేవాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్నఉత్తర ప్రదేశ్ పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.

కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..

దుకాణదారుడు సహా ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులు బాఘ్‌పత్ ప్రాంతంలో గడిచిన పదేళ్లుగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. వీరి నుంచి 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 140 చొక్కాలు, 34 ధోతీలు, 52 వైట్ చీరలు, 112 ట్రేడ్‌మార్క్ స్టిక్కర్లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించడమే కాకుండా, అంటువ్యాధి చట్టం క్రింద కూడా వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, కేసుల కన్నా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ, నిన్న ఒక్కరోజే 3,56,082 మంది డిశ్చార్జ్, దేశంలో తాజాగా 3,29,942 మందికి కరోనా, 3,876 మంది కోవిడ్ కారణంగా మృతి

ఏడుగురు నిందితుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసు అధికారి తెలిపారు. నిందితులు గత కొన్నేళ్లుగా మృతుల నుండి బట్టలు దొంగిలించారని అధికారి తెలిపారు. కాగా COVID-19 తో ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్‌లో 15,170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనావైరస్ లాక్డౌన్ను యూపీ ప్రభుత్వం మరో వారం పాటు పొడిగించింది.