Covid in China (Photo-Video Grab)

Beijing, Jan 5: ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్‌ చైనాను (COVID Scare in China) కకావికలం చేస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌7 ధాటికి నగరాలకు నగరాలే పెరుగుతున్న కేసులతో విలవిలలాడుతున్నాయి. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతటి భయంకర పరిస్థితులు కనిపిస్తుంటే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం (China Govt) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే కథనాలు వెలువడుతున్నాయి.డ్రాగన్ కంట్రీ కరోనావైరస్ లెక్కలు వెల్లడించకుండా ప్రపంచ దేశాలను అయోమయంలో పడేస్తోంది. చైనా కేసులు, మరణాలు వివరాలు ఇప్పటికీ బయటికి రావడం లేదు.

XBB.1.5 కొత్త వేరియంట్ ప్రమాదకరమా, భారత్‌లో ఈ వేరియంట్‌కి సంబంధించి 5 కేసులు నమోదు, ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ గురించి కొన్ని నిజాలు..

సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చైనాలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.కోవిడ్‌ రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతుండగా రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేసి ఇళ్లకు వెళుతున్నారు. రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్‌ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ వార్తలు డ్రాగన్ కంట్రీ గుండెల్లో గుబులు రేపుతోంది.

Here's Videos

కోవిడ్‌ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్‌ హోమ్స్‌) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను ( families forced to burn bodies) నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు (crematoriums and funerals homes overflow) జరిపేస్తున్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.