Coronavirus Pandemic: కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, May 11: దేశంలో కరోనావైరస్ మహమ్మారి జీవితాలను చిధ్రం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా దెబ్బకు (Coronavirus Pandemic) కాటికి వెళుతున్నాయి. ఏ కుటుంబంలో చూసినా ఇలాంటి విషాద గాధలే కనిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు కరోనాతో మృతి చెండంతో (Son die of COVID-19) తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెపోటుతో (parents died of a heart attack) కన్నుమూశారు.

హైదరాబాద్‌ కాప్రా డివిజన్‌ వంపుగూడలో నివాసం ఉంటున్న పీసరి హరీశ్వర్‌రెడ్డి (31) ఆదివారం కరోనాతో మృతి చెందారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లిదండ్రులు జనార్దన్‌రెడ్డి (60), జ్యోతి (54) 24 గంటల్లోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఇద్దరూ కేవలం ఐదునిమిషాల వ్యవధిలోనే మృతిచెందారు.

ఇదే తరహాలో హైదరాబాద్‌లోని హెచ్‌బీ కాలనీ ఫేజ్‌-2 వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సం యుక్త కార్యదర్శి ప్రభుకుమార్‌ (42) ఏప్రిల్‌ 25న కరోనాతో మృతిచెంచారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లి భారతీబాయి ఈ నెల 6న, తండ్రి మాధవాచారి 7న మృతి చెందారు. లక్ష్మీనగర్‌లో బడేమియా (70)గా పేరొందిన ఓ ఫంక్షన్‌హాలు యజమాని పెద్ద కుమారుడు కరోనాతో ఆరునెలలక్రితం మరణించాడు. చిన్న కుమారుడు రెండువారాల క్రితం చనిపోయారు. ఈ విషాదాలను తట్టుకోలేక బడేమియా గతవారం మృతి చెందారు.

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, కేసుల కన్నా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ, నిన్న ఒక్కరోజే 3,56,082 మంది డిశ్చార్జ్, దేశంలో తాజాగా 3,29,942 మందికి కరోనా, 3,876 మంది కోవిడ్ కారణంగా మృతి

మరో చోట కూడా ఇలాంటి ఘటనలో చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోతె పట్టీనగర్ గ్రామానికి చెందిన మోతే వీరభద్రస్వామి ఆలయం మాజీ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాసరావు 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ సమయంలో శ్రీనివాసరావు కొడుకు తాళ్లూరి శ్రీకాంత్(30) తండ్రికి సేవలు అందించి ధైర్యం చెప్పాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డాడు.

హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం ఉదయం ఆరోగ్యం విషమించి శ్రీకాంత్ మృతిచెందాడు. మృతుడికి గత ఏడాది పెండ్లయింది. శ్రీకాంత్​మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బూర్గంపహాడ్ సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, కుటుంబసభ్యులు పీపీటీ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.

బెంగుళూరుపై షాకింగ్ న్యూస్, ఈ నెలలో మరణాలు దారుణంగా పెరిగిపోతాయని తెలిపిన ఐఐఎస్‌సీ, నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, ఖాళీ అవుతున్న కర్ణాటక రాజధాని

హైదరాబాద్​లోని జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో గల గణేశ్​నగర్, కల్పనా సొసైటీకి చెందిన కె. ఆదినారాయణ, కె.కనకదుర్గ భార్యభర్తలు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. 10 రోజుల క్రితం నలుగురికీ పాజిటివ్​అని తేలింది. తర్వాత ఆదినారాయణ హాస్పిటల్​లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం అతనికి సీరియస్​గా ఉందని తెలిసి మనస్తాపం చెందిన కనకదుర్గ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్​చేసుకుంది. ఆమె చనిపోయిన 15 నిమిషాలకు ఆదినారాయణ హాస్పిటల్​లో మృతిచెందారు.

యాదాద్రి జిల్లా బీబీనగర్​మండలం నెమురగోములలో పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు, కొడుకు కరోనాతో చనిపోయారు. గ్రామానికి చెందిన సురకంటి బాలమణి(70), సురకంటి చంద్రయ్య(75) భార్యాభర్తలు. వీరికొడుకు జంగయ్య(45). ఇటీవల బాలమణి, చంద్రయ్యకు కరోనా సోకడంతో జంగయ్య హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చేర్పించాడు.

చికిత్స పొందుతూ బాలమణి మే1న మృతిచెందింది. చంద్రయ్య 3న చనిపోయాడు. ఆ తర్వాత జంగయ్య టెస్టు చేయించుకోగా పాజిటివ్​వచ్చింది. చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున జంగయ్య మృతిచెందాడు. ప్రస్తుతం జంగయ్య భార్యకి కరోనా పాజిటివ్​రావడంతో ట్రీట్​మెంట్​పొందుతున్నట్టు సమాచారం. జంగయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే

పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన కొమ్మ రమేష్‌గుప్తా (39) వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడు చనిపోయిన నాటి నుంచి బెంగ పెట్టుకున్న మృతుడి తండ్రి ఈశ్వరయ్య (90) వారం రోజులు గడువకముందే గురువారం రాత్రి మరణించాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు మరణించడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. మృతుల కుటుంబాలకు ఎంపీపీ చందనా ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డి, పలువురు గ్రామపెద్దలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని జి.కొత్తూరు గ్రామానికి చెందిన టేకులపల్లి సొసైటీ కార్యదర్శి వేమిరెడ్డి వెంక ట్రామిరెడ్డి (58) కరోనా బారినపడి హైదరాబాద్‌ లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మూడురోజుల క్రితం కొడుకు వేణు కరోనాతో మృతి చెందాడు. ఒకే ఇంట్లో మూడు రోజుల వ్యవధిలోనే తండ్రీ, కొడుకులు మృతి చెందటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్‌ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

కర్నూలు జిల్లాలో తల్లి, కొడుకు కరోనాతో మృతి చెందారు. వారం క్రితం కరోనా లక్షణాలు ఉండంటంతో ఇద్దరూ. పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారికి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ కొడుకు నరసింహన్‌ (65), తల్లి సరోజమ్మ (85) మృతిచెందారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్‌నాయక్‌(55) ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. గత నెల 28న జైపాల్‌నాయక్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి మునావత్‌ నాన్కు(80) కొంతసేపటికే గుండె పోటుతో చనిపోయింది. కాగా ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేదని తండావాసులు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో 3 రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులతో పాటు తల్లి కరోనాతో మృతి చెందారు. చిన్నకోడూరు మండలానికి చెందిన రాజనరేందర్ తో పాటు ఆయన సోదరుడు రాజు, తల్లి సులోచనకు కరోనా సోకింది. వీరంతా హైదరబాద్‌‌ లోని ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు.

కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాపోల్ గ్రామంలో కరోనా వైరస్ బారినపడి 15 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందారు. గత నెలలో గణపతిరావు (65) కరోనా సోకి ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడు. తండ్రి మృతితో విషాదం నిండిన ఆ ఇంట్లో ఆయన కొడుకు శ్రీనివాస్ (30) ఈ నెల 3న కరోనాతో చనిపోయాడు. శ్రీనివాస్ కు భార్య, కొడుకు ఉన్నారు.

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేటకు చెందిన రైస్​మిల్​ వ్యాపారి కొమ్ము రమేశ్​ (40) కరోనా బారిన పడి ట్రీట్​మెంట్​ తీసుకుంటూ గత నెల 25న చనిపోయాడు. కరోనా సోకి ఆనారోగ్యం పాలవడంతోపాటు కొడుకు చనిపోయిన బెంగతో రమేశ్​ తండ్రి ఈశ్వరయ్య(73) ఈ నెల 6న చనిపోయాడు. 12 రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు మృతి చెందడంతో వారింట్లో తీరని విషాదం నెలకొంది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌ పట్టణంలో కరోనాతో 48 గంటల వ్యవధిలో వృద్ద దంపతులు మృతి చెందారు. పట్టణానికి చెందిన ఎ.ఆదిరెడ్డి(83), రామవ్వ(78) కరోనా బారిన పడి కరీంనగర్ లోని హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. కొద్దిగా కోలుకున్నాక హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ అయి హుస్నాబాద్‌‌ లోని ఇంటికి వచ్చి ఇంట్లోనే వైద్య సేవలు పొందుతుండగా ఏప్రిల్​ 20న ఆదిరెడ్డి మృతి చెందగా, 22న భార్య రామవ్వ కూడా మృతి చెందింది.

ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాస‌విన‌గ‌ర్ కు చెందిన ఆర్ఎంపీ కిష్టయ్య 15 రోజుల కింద క‌రోనాతో చనిపోయాడు. ఆయన భార్య అనసూయకు కూడా కరోనా సోకగా హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ మృతి చెందింది.

సూర్యాపేట జిల్లా కోదాడలో 24 గంటల్లోనే తండ్రి, తల్లి, కుమారుడు కరోనాకు బలయ్యారు. కొమరబండకు చెందిన ఓరుగంటి వెంకటేశ్వర్లతో పాటు తల్లిదండ్రులు అంజమ్మ, రంగయ్యకు గత నెల 20న కరోనా పాజిటివ్‌‌‌‌ వచ్చింది. నాలుగు రోజులకు వెంకటేశ్వర్లు ఆరోగ్యం క్షీణించగా ఖమ్మం తీసుకెళ్లారు. ఇంట్లోనే ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న తండ్రి రంగయ్య ఏప్రిల్‌‌‌‌ 30న రాత్రి చనిపోయాడు. మరుసటిరోజు తల్లి అంజమ్మ, వెంకటేశ్వర్లు కూడా ప్రాణాలు విడిచారు.

హైదరాబాద్ నీళ్లలో ప్రమాదకర వైరస్, తాకితే చాలా డేంజర్, గ్రేటర్‌ చెరువుల్లో న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమస్‌–1 బ్యాక్టీరియాని గుర్తించిన హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధకులు, కాలుష్యమే కారణమని వెల్లడి

జగిత్యాల కు చెందిన దొంతుల రామ చంద్రం (67) కిరాణ షాపు నడుపుతుంటాడు. ఈయనకు సునీల్(36), సుమన్ (30) ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సుమన్ కు భార్య, కూతురు, కొడుకు ఉండగా.. సుమన్ కు ఇటీవలే పెళ్లయింది. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. గత నెల తండ్రి రామచంద్రం, కొడుకులు సునీల్​, సుమన్​కు కరోనా సోకింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ ఏప్రిల్​ 13 న సునీల్​, రెండు రోజులకు రామచంద్రం, వారం రోజులకు సుమన్​ చనిపోయారు.

ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

రాజస్థాన్ బార్మేడ్‌లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ షర్దా (93) ఇటీవల కరోనా బారినపడ్డాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే భార్య మరణించింది. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం జోధ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం దామోదర్ దాస్ మరణించారు. అక్కడి నుంచి స్వగ్రామం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు కొడుకులు ఎవరూ లేకపోవడంతో చిన్న కూతురు చందనా షర్ (34)దానే చితికి నిప్పటించింది. కట్టెల్లో కాలుతున్న తండ్రిని చూసి గుండెలవిసేలా రోదించింది చందన. అంతలోనే ఏమైందో ఏమో.. ఒక్కసారిగా చితి మంటల్లోకి దూకేసింది.