Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, May 10: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే దానికి తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ తయారయింది. కోవిడ్ ను జయించిన పేషెంట్లను (Mucormycosis Infection in COVID-19 Patients) అది చావు దెబ్బ తీస్తోంది. సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది బ్లాక్‌ ఫంగస్‌ (Mucormycosis Infection) సోకి కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను గుర్తించారు. తాజాగా దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటిలో తెలిపారు. మ్యూకోర్‌మైకోసిస్ (Black Fungal Infection) అనేది ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్(బూజు లాంటిది) వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందన్నారు వైద్యనిపుణులు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.

బెంగుళూరుపై షాకింగ్ న్యూస్, ఈ నెలలో మరణాలు దారుణంగా పెరిగిపోతాయని తెలిపిన ఐఐఎస్‌సీ, నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, ఖాళీ అవుతున్న కర్ణాటక రాజధాని

కాగా డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు. మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్‌మైకోసిస్‌కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చికిత్స విషమ పరిస్థితుల్లో ఉన్న కోవిడ్-19 రోగుల ప్రాణాలను కాపాడగలదని అంటున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌, ‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ వ్యాధి గతంలో కూడా ఉంది. అయితే తాజాగా కోవిడ్‌ సోకిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే ‘మ్యూకోర్‌’ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది.

Here's ICMR Advisory

ముఖ్యంగా కరోనా సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. ఇది మెదడుకు చేరితో ప్రాణాపాయం తప్పదు అంటున్నారు నిపుణులు. కోవిడ్‌ మాదిరి ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కోవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మతి భ్రమించడం, శరీరంలో షుగర్‌ లెవల్స్‌ సడెన్‌గా పడిపోవడం, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టడం వంటి తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి.

మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్‌ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

రాకుండా ఏం చేయాలి : రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచుకోవాలి.

కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ని పరీక్షించుకోవాలి.

సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి.

ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి.

డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్‌, యాంటీఫంగల్‌ ఔషధాలను తీసుకోవచ్చు.

నిరోధించడం ఎలా : బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి.

వీలైనంత వరకు శరీరం మొత్తం కవర్‌ అయ్యేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్‌, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.