Andhra Pradesh Shocker: మార్కాపురంలో దారుణం, పెళ్లి చేయడం లేదని కన్నతండ్రి గొంతు కోసి చంపిన కొడుకు, అనంతరం అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య
తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.
Prakasam, Oct 16: ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లికాకుండా అడ్డుకుంటున్నాడనీ, పెళ్లి చేయడం లేదని ఆగ్రహించి ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా చంపేశాడు. మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రాయవరం గ్రామంలోని కనకదుర్గ కాలనీకి చెందిన పత్తిపాటి బాల భద్రాచారి (57), భార్య లక్ష్మీకాంతమ్మకు కుమారుడు గురునారాయణతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కుమారుడు పదో తరగతి పూర్తయిన తరువాత వడ్రంగి పనిచేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే 25 ఏళ్లు వచ్చినా తనకు పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులతో తరచుగా గొడవపడుతున్నాడు. వచ్చిన సంబంధాలను కూడా తిరస్కరిస్తున్నారని డిప్రెషన్‌కు గురైన గురునారాయణ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల తరువాత తండ్రిని బహిర్భూమికి తోడుగా తీసుకునివెళ్లి గొంతుకోశాడు.
కలకత్తాలో దారుణం, భార్య విడాకులు అడిగిందని కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం విషం తాగి ఆత్మహత్య
రక్తం మడుగులో భద్రాచారి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అనంతరం గురునారాయణ అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా కేకలు విని గ్రామస్తులు బయటకు వచ్చారు. జరిగిన సంఘటనను చూసి కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు.
గురునారాయణకు మార్కాపురం జిల్లా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్‌పీ వీరరాఘవరెడ్డి, మార్కాపురం ఇన్‌చార్జి సీఐ రాజేష్ తదితరులు పరిశీలించారు.