AP Shocker: అద్దె అడిగినందుకు యజమానినే చంపేశాడు, మరోచోట ఆర్టీసీ బస్సులోనే కుప్పకూలిన పెద్దాయన, అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన

మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Representational Image (Photo Credits: Pixabay)

Amaravati, Mar 2:  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని ఓ దుర్మార్గుడు (AP Shocker) హతమార్చాడు. పాలకొల్లు ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్‌ ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య కుటుంబం అద్దెకు ఉంటోంది. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. సోమవారం రాత్రి ఇంటి యాజమాని చిన కొండయ్యను అద్దె చెల్లించమని అడిగాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో యజమాని తలపై (tenant killed house owner) కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మైదుకూరు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సులో మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేపరాల యర్రన్న (80) మృతి చెందారు. ఈయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధతున్నారు. ఇతన్ని భార్య సాలమ్మ రిమ్స్‌కు తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో సీటులోనే కుప్పకూలి మృతి చెందాడు. బస్సు బస్టాండుకు రాగానే ఆర్టీసీ సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ శివారెడ్డి, కానిస్టేబుల్‌ రవి, చిన్నచౌకు ఔట్‌పోస్టు సిబ్బంది గోపాల్‌లు మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారితో కలిసి మృతదేహాన్ని తిప్పిరెడ్డిపల్లెకు పంపించే ఏర్పాట్లు చేశారు.

యూపీ హత్రాస్‌లో మరో దారుణం, లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రి హత్య, జైలు నుంచి బయటకు వచ్చి కాల్చి చంపిన నిందితుడు, న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన భాదితురాలు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు.