Andhra Pradesh Shocker: నెల్లూరు జిల్లాలో దారుణం, క్షుద్ర పూజల పేరుతో పిల్లలను చంపేందుకు తండ్రి ప్రయత్నం, చికిత్స పొందుతూ బాలిక మృతి

ఈ క్రమంలో బిడ్డ ఊపిరి ఆడక కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న స్థానికులు వేణు ఇంటికొచ్చి జరిగింది చూశారు.

Representational Image | (Photo Credits: IANS)

Nellore, June 16: నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటు (Andhra Pradesh Shocker) చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో పిల్లలకు చంపేందుకు కన్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. కాగా, తండ్రి వేణు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. అనంతరం నాలుగేళ్ల కూతురు నోట్లో కుంకుమ పోసి పూజలు చేసిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన నాలుగేళ్ల చిన్నారి పునర్విక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్నారి నోట్లో కుంకుమ పోసి పూజలు చేస్తే తాను దేవుడిని అయిపోతాను అనే పిచ్చి నమ్మకంతో కన్నకూతురిని(Three-Year-Old Girl Child Dies ) పొట్టనపెట్టుకున్నాడా తండ్రి.

తాను దేవుడిని అయిపోవాలనే మూఢనమ్మకంతో ముక్కుపచ్చలారని నాలుగేళ్ల కన్నబిడ్డ నోట్లో కుంకుమ పోసి తనకు తెలిసిన పిచ్చి పిచ్చి పూజల్నీ చేశాడు తండ్రి వేణు. ఈ క్రమంలో బిడ్డ ఊపిరి ఆడక కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న స్థానికులు వేణు ఇంటికొచ్చి జరిగింది చూశారు. అంతే కన్నబిడ్డమీద ఏంటీ దురాగతం అంటూ తిట్టి చితకబాదారు. అనంతరం వారి బంధువులకు సమాచారం అందించి బిడ్డను చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న నాలుగేళ్ల పునర్విక తీవ్ర అస్వస్థతకు గురి అయి గురువారం (16,2022) తెల్లవారుఝామున కన్నుమూసింది.

ఇదేమి దారుణం, వైద్యం చేయాలంటూ పిలిచి కూతురితో పెళ్లి చేశారు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన డాక్టర్, కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు నమోదు

ఈ విషయంపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పారిపోయిన వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, వేణు.. శాంతి పూజల కోసమా లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. కన్న బిడ్డలనే ఇలా వేణు చంపాలని చూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.



సంబంధిత వార్తలు

Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి

Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు