Andhra Pradesh Shocker: సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా, పొట్టకూటికోసం వెళుతూ మంటల్లో కాలిపోయిన 5 మంది కూలీలు

జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడటంతో 8మంది సజీవ దహనం (8 People Burnt Alive ) అయ్యారు. మృతులు గుడ్డంపల్లివాసులుగా గుర్తించారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Satya sai , June 30: సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం (Andhra Pradesh Shocker) జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడటంతో 5 మంది సజీవ దహనం (8 People Burnt Alive ) అయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుడ్డంపల్లివాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Bishwabhushan harichandan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, దానిలో ప్రయాణిస్తున్న కూలీలు మృతి చెందడం విచారకరమని అన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు.

వీరంతా వ్యవసాయ పనుల నిమిత్తం తాడిమర్రి మండలం బుడ్డపల్లికి చెందిన కూలీలు చిల్లకొండయ్యపల్లికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొద్దిరోజులుగా అక్కడ విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న ఇనుప వస్తువు హై టెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ( High Tension Wires Hit) ప్రమాదం జరిగింది అంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లా, తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. మృతుల కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడడంతో ప్రమాదం జరిగింది అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి అన్నారు.