CP Gurnani Meets CM Jagan: విశాఖలో టెక్ మహీంద్రా భారీ పెట్టుబడులు, సీఎం జగన్‌ను కలిసిన సీఈవో సీపీ గుర్నాని, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు రెడీ అవుతున్నట్లు వెల్లడి

ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్రా గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.

Tech Mahindra MD CP Gurnani meets CM Jagan Mohan Reddy (photo-X/AP CMO)

Vjy, Oct 12: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్రా గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది. ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎంకి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులు వివరించారు.

జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్

ఏపీలో పర్యాటక రంగం అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి మహీంద్ర గ్రూప్‌ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సహా మరో 2 పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటల్స్‌ నిర్మాణం చేపట్టనున్న మహీంద్ర గ్రూప్, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు సమాయత్తమవుతున్నట్లు వెల్లడించింది.ఈ సమావేశంలో మహీంద్ర గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్ర సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్ర విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు.