Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఆటో, 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు

స్థానిక కెఎల్‌.పురం రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆటోను వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో పది మంది కూలీలు (Ten People Injured) తీవ్రంగా గాయపడ్డారు.

Accident (Credits: Google)

Vizianagaram, Nov 11: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vizianagaram Road Accident) చోటు చేసుకుంది. స్థానిక కెఎల్‌.పురం రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆటోను వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో పది మంది కూలీలు (Ten People Injured) తీవ్రంగా గాయపడ్డారు.

వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జిల్లాలోని (Vizianagaram) బొండపల్లి మండలానికి చెందిన మజ్జి సూర్యనారాయణ, దొంతల జమ్మన్న, గెద్ద రమణ, చిల్ల శ్రీను, అలమండ రమణ, సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావు, బొబ్బిలికి చెందిన చైతన్యతో పాటూ అంబటివలసకి చెందన పీతల రాంబాబులు గూడ్స్‌ వద్ద జరుగుతున్న కలాసీ పనులకు గురువారం ఆటోలో వెళ్తున్నారు.

ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం, తునాతునకలైన ఇద్దరి శరీర భాగాలు, బాణసంచాను వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు

స్థానిక ద్వారపూడి రైల్వే బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి జైపూర్‌ నుంచి విశాఖ వైపు రోగులను తీసుకువెళ్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ ఈ ఆటోని ఢీకొంది. దీంతో ఆటో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అదే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వారిలో సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ విజయ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.