Chandrababu Yerragondapalem Tour: యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు, చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్, నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులు నిరసనకు దిగారు

Chandrababu Yerragondapalem Tour (Photo-Twitter)

Prakasam, April 21: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.చంద్రబాబు వాహనంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్‌ చేశారు.

దాంతో, తన వాహనంలోంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబు నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఎన్ఎస్ జీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి చంద్రబాబుపై రాళ్లు పడకుండా నిలువరించారు. ఇదంతా మంత్రి ఆదిమూలపు సురేశ్ కార్యాలయం ముందే జరిగింది. వైసీపీ కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు.

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌, ఎన్ని పోస్టులనే దానిపై కసరత్తు చేస్తున్న సర్కారు, త్వరలో గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు.

Here's Videos

గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్‌ నేత మన్నె రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. మార్కాపురం పర్యటన పూర్తి చేసిన చంద్రబాబు.. యర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.