Minister Botsa Satyanarayana (Photo-Video Grab)

Vjy, April 21: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

‘‘విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసీ. అమరావతి రాజధాని అయితే, చంద్రబాబు కాపురం హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు. కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?’’ అని మంత్రి ప్రశ్నించారు.విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు. నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం.’’ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. విద్యార్థులకు రాగి జావ నిలిపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పరీక్షలు, ఒంటిపూట బడుల వల్లే చిక్కీలు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

వివేకా హత్య కేసులో ట్విస్ట్, సీబీఐ ముందుకు వివేకానంద రెడ్డి రెండో భార్య షమీమ్, ఆస్తిపై కూతురు వ్యామోహం పెంచుకున్నదంటూ..

దీంతో పాటుగా త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ సర్కార్ కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం.. గ్రూప్-1 పోస్టులు 140, గ్రూప్-2 పోస్టులు అత్యధికంగా 1082 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.