Andhra Pradesh Voting Percentage: ఏపీలో ఎన్నికల పోలింగ్ శాతం ఎంతంటే? జజిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ లు విడుదల చేసిన ఎన్నికల సంఘం
సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది
Vijayawada, May 15: ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ శాతంపై (Voting Percentage) క్లారిటీ వచ్చేసింది. ఏయే జిల్లాలో ఎంతెంత శాతం ఓటింగ్ నమోదైందన్న వివరాలను అధికారులు ప్రకటించారు. గత రాత్రి వరకు పోలింగ్ కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు లైనులో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏపీలో మొత్తం 81 శాతం వరకు ఓటింగ్ నమోదైంది.
తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
అత్యధికంగా సత్యవేడులో 84.28 శాతం నమోదు
అత్యల్పంగా తిరుపతిలో 59.95 పోలింగ్ శాతం నమోదు
చిత్తూరు జిల్లాలో 82.65 శాతం పోలింగ్ నమోదు
అత్యధికంగా కుప్పంలో 85.87 శాతం నమోదు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగానే నమోదైన పోలింగ్
రాయలసీమలో పెరిగిన ఓటింగ్ శాతం
కర్నూలు జిల్లా లో 76.17 శాతం పోలింగ్ నమోదు
నంద్యాల జిల్లాలో 81.12 శాతం
కడప జిల్లాలో 78.12 శాతం
అన్నమయ్య జిల్లా 76.83 శాతం
అనంతపురం జిల్లా 79.25 శాతం
సత్యసాయి జిల్లా 82.77 శాతం
గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ లోను పెరిగిన ఓటింగ్ శాతం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతం కంటే దాదాపు 2 శాతం ఎక్కువగా నమోదైన పోలింగ్