AP TIDCO Houses Inauguration: 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి, టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబుపై విరుచుకుపడిన సీఎం జగన్

ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు

YS Jagan (Photo-Twitter)

Gudiwada, June 16: రాష్ట్ర సర్కార్‌ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.అధికారంలోకి వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చాం. ఐదు లక్షల 52 వేల ఇళ్లు పూర్తయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 178 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి ఇచ్చిన స్థలం విలువ రూ.2 నుంచి రూ.10 లక్షలు. పూర్తయిన ప్రతీ ఇంటి కోసం అయిన ఖర్చు రూ. 10 నుంచి 12 లక్షలు. ఇక నుంచి 16 వేలకు పైగా కుటుంబాలు ఈ టిడ్కో ఇళ్లలోనే ఉండబోతున్నాయి అని సంతోషం వ్యక్తం చేశారాయన. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 17 వేల కాలనీల నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్‌ తెలియజేశారు.

నా ఈకలు కూడా పీకలేవు పవన్, నీకంటే పెద్ద మొగోడిని నేను, రెండు చెప్పులు చూపిస్తూ మక్కెలిరిగిపోతాయంటూ పేర్ని నాని మాస్ వార్నింగ్

ఇదే గుడివాడలో పేదలకు టిడ్కో ఇళ్లపై హామీ ఇచ్చా. ఇప్పుడు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది ఇప్పుడు. కేవలం రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను అందిస్తోంది. ప్రతీ లబ్ధిదారునికి రూ. 7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చాం. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టాం. 8,859 ఇళ్లకు అదనంగా జులై 7వ తేదీన మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం జగన్‌ తెలియజేశారు.

పేదల ఇళ్ల కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయాడని నిలదీశారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.టీడీపీ పెత్తందారుల పార్టీ అని, పేదల వ్యతిరేకి కాబట్టే చంద్రబాబు ఏం చేయలేదని విమర్శించారు సీఎం జగన్‌.పేదవాడికి చంద్రబాబు నాయుడు ఏనాడూ సెంటు స్థలం ఇచ్చింది లేదు. మూడుసార్లు సీఎం అయినా టిడ్కో ఇళ్లు కట్టలేకపోయారు. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు కావాలంటే డబ్బు కట్టాల్సిందే. ఇదే భారం పేదలపై పడి ఉంటే.. 20 ఏళ్ల పాటు నెలకు 3 వేల చొప్పున కట్టవల్సి వచ్చేది. కానీ, మన ప్రభుత్వం కట్టించడమే కాదు.. రిజిస్ట్రేషన్‌ చేసి మరీ ఇస్తోంది.

అర్హులై ఉండి పథకాలు అందని వారి కోసం సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, ఈ నెల 23 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం

నాటి పాలనకు నేటి పాలనకు తేడా గమనించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలు నెరవేర్చాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. లంచాలకు తావు లేకుండా లబ్ధిదారులకు నేడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామస్థాయ నుంచే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ నాలుగేళ్ల కాలంలో రూ. 2.16 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం. మంచి చేశాం కాబట్టే నేడు ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని అన్నారాయన.

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కులాల సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టుల కెక్కాడు. 14 ఏళ్లు సీఎంగా పేదలకు మేలు చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే చంద్రబాబుకు లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు తయారయ్యారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇంకో ఛాన్స్‌ ఇస్తే మంచి చేస్తానని బాబు చెబుతున్నాడు.

ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఏదో చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. ఇంకా ఎక్కువే చేస్తా అంటున్నాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి.. మీ ప్రతీ ఇంటికి బంగారం ఇస్తా అంటున్నాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి బెంజ్‌ కారు ఇస్తా అంటూ ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి(చంద్రబాబు) మోసం చేయడానికి బయల్దేరాడు. ఇంకో చాన్స్‌ ఇవ్వండి.. ఇది చేస్తా అది చేస్తా అంటాడే తప్ప సీఎంగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని మాత్రం అడగలేడు. మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషికి లేనే లేదు కాబట్టి.. ఓటేయండి అని అడగలేకపోతున్నాడని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను గమనించాలని ప్రజలను సీఎం జగన్‌ కోరారు.

జిత్తులు, ఎత్తులు, పొత్తులనే చంద్రబాబు నమ్ముకున్నాడు. రెండు పక్కల కూడా రెండు పార్టీలు లేకుంటే చంద్రబాబు నిలబడలేడు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోని టీడీపీ చెత్త బుట్టలో పడేస్తోంది. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ. దుష్టచతుష్టయాన్నే ఆయన నమ్ముకున్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేసిన మంచిని చంద్రబాబు చూపించలేకపోయారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు కలిసి గజదొంగల ముఠా ఏర్పడ్డాయి. వీళ్లు ఓ దత్తపుత్రుడు తోడయ్యాడు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే దొంగల ముఠాకు అధికారం కావాలి. దోచుకోవడం, పంచుకోవడం, తినడం కోసమే వీళ్లకు అధికారం కావాలి.

రెండు పక్కల రెండు పార్టీలు ఉంటేగానీ నిలబడలేని చంద్రబాబు.. 175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి అంట. మరోవంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయ్యి కూడా.. తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యాను చూసి మురిసిపోతూ.. తాను కూడా ఎమ్మెల్యే అవుతానంటూ , తననె ఎవరు ఆపుతారో చూస్తాను అని అనే ప్యాకేజీ స్టార్‌.. దత్తపుత్రుడు మరో వంక. వీళ్లు మన ప్రత్యర్థులంట.

మీ బిడ్డ నమ్ముకుంది ప్రజలనే!

గజదొంగల ముఠా.. తోడేళ్ల ముఠాతో ఒంటరిగానే మీ బిడ్డ పోరాటం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలని చంద్రబాబుకు చురకలంటించారాయన. మీ బిడ్డ రాజకీయాల్లో ప్రజలనే నమ్ముకున్నాడు. అబద్ధాలను, అవాస్తవాలను నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్సార్‌సీపీకి అండగా నిలవండి యావత్‌ ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి కోరారాయన.